గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ టీచర్‌పై ప్రేమ పేరుతో దాడి: చెత్తలో విద్యార్థిని శవం

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలం దోమలగొంది పాఠశాలలో రత్నకుమారి అనే ఓ ఉపాధ్యాయురాలిపై ఓ దుండగులు కత్తితో దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులు ఐ డాదికి పాల్పడినట్లు చెబుతున్నారు. కాగా, మరో కథనం కూడా వినిపిస్తోంది. ప్రేమిస్తున్నానంటూ యువకుడు చేసినట్లు కూడా చెబుతున్నారు. దాడితో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. గాయపడిన ఉపాధ్యాయురాలిని ఆసుపత్రికి తరలించారు.

Attack on lady teacher at Visakhapatanm

విశాఖలో చోరీ

విశాఖపట్టణంలోని ద్వారకా జోన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఇంట్లోని 30 తులాల బంగారంతోపాటు 21.5 లక్షల నగదును అపహరించుకువెళ్లారు

గుంటూరు జిల్లా బాపట్ల మార్కెట్‌యార్డు చెత్తలో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం ప్రత్యుష అనే యువతిదని గుర్తించారు. తమ కుమార్తెది హత్య అని మృతురాలి తల్లిదండ్రులు ఆోపించారు. ఈ నెల 6వతేదీన అదృశ్యమైన ప్రత్యుష మృతదేహంగా సోమవారం చెత్తలో పడి ఉంది.

గంజాయి స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో కోటి రూపాయల విలువగల 35 బస్తాల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చెరువులో పడి ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలోని చెరువులో ఇద్దరు బాలికలు, ఓ బాలుడి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఆదివారం అదృశ్యమైన ముగ్గురు పిల్లలు మృతదేహాలుగా తేలాయి. వీరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతులు మణికంఠ (7), పావని(6), పల్లవి(4) గా గుర్తించారు. పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మృత్యువాతపడ్డారు.

English summary
A lady teacher has been attacked by unidentified persons in Visakahapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X