వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుని అర్బన్ పిఎస్‌పైనా దాడి: సిఎం ఆఫీస్ చుట్టూ భారీ భద్రత, రైళ్ల నిలిపివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కార్యాలయం చుట్టూ భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, మంగళగిరి నుంచి తునికి ఎపి బెటాలియన్లను పంపించారు.

తుని రూరల్ పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన కాపు ఆందోళనకారులు అర్బన్ పోలీసు స్టేషన్‌పైనా దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు గాయాలయ్యాయి. దీంతో భయాందోళనలకు గురైన పోలీసులు ఆస్పత్రికి పరుగులు పెట్టారు.

PS burnt

తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనతో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేస్తున్నట్లు విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిస్థితి చక్కబడిన తర్వాతే రైళ్లు నడుపుతామని. సుమారు 20 రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేసినట్లు తెలిపారు.

ప్రయాణికులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టిక్కెట్లు ధర పూర్తిగా వెనక్కి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

English summary
Kapu agitators attacked Thuni urban ps also. Rails from Visakhapatnam have been stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X