విద్యార్థిపై లైంగిక దాడి: మహిళను వివస్త్రను చేసేయత్నం

భార్య న్యాయపోరాటం
తనను భర్త మోసం చేశాడంటూ ఓ భార్య న్యాయ పోరాటం చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రమాదేవి, రాఘవేంద్రలకు కొంతకాలం క్రితం వివాహం అయింది. ఇటీవల భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిని భార్య ప్రశ్నించింది. ఆమెకు చిత్రహింసలు పెట్టాడు. దీంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్దపడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో సోమవారం పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళా సర్పంచి, ఆమె భర్తపై సామూహికంగా దాడి చేసి.. సర్పంచిని వివస్త్రను చేసేందుకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పదిహేను రోజులుగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువర్గాల వారిని అరెస్టు చేసినా వివాదం సద్దుమణగలేదు. సర్పంచి, ఆమె భర్త నిన్న కారోబార్‌తో మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన కొందరు మూకుమ్మడి దాడికి యత్నించారు. సర్పంచి చీరను లాగి వివస్త్రను చేసేందుకు యత్నించారు.












Click it and Unblock the Notifications