ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు...
ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టాటా-ఎర్నాకుళం-టాటా మధ్య ప్రత్యేక రైళ్లు తీసుకరానున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం త్రిపాఠి ప్రకటించారు. ఫిబ్రవరి 5, 12 తేదీల్లో టాటా- ఎర్నాకుళం(08189) ప్రత్యేక రైలు తెల్లవారుజామున 5.15 గంటలకు టాటాలో బయలుదేరి అదే రోజు రాత్రి 8.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి 8.45 గంటలకు బయలుదేరి వెళుతుంది. ఫిబ్రవరి 8,15 తేదీల్లో ఎర్నాకుళం-టాటా(08190) ప్రత్యేక ట్రైన్ ఉదయం 7.15 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరుతుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు.
మరో రెండు రైళ్ల సమయాల్లో తాత్కాలిక మార్పులు చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో రెండు రైళ్ల బయలుదేరే సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి వివరించారు. ఈ నెల 2న ఉదయం పది గంటలకు వెళ్లే చెన్నై సెంట్రల్- భువనేశ్వర్(12829) రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరనుంది. ఉదయం పది గంటలకు బయలుదేరే పురులియా-విల్లూపురం(22605) ఎక్స్‌ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది. అంటే ఉదయం 10కి బయలుదేరాల్సిన ట్రైన్ సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారి తెలిపారు.

ఆయా తేదిల్లో విశాఖ టు గుణుపూర్ వెళ్లే ట్రైన్ రద్దు : ఇక, ఈ నెలలో విశాఖ టు గుణుపూర్ వెళ్లే ట్రైన్ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లో విశాఖ - గుణుపూర్ - విశాఖ (08522-08521) రైళ్లను ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఆయా తేదిల్లో గుణుపూర్-రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ పలాస-రూర్కెలా మధ్య మాత్రమే నడుస్తుందని ఆయన అన్నారు. ఆ తేదిల్లో ప్రయాణించేవారు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications