విజయవాడ డివిజన్‌లో రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే శాఖలో పదో తరగతి అర్హతతో ఫెసిలిటేటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైనవారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే డివిజన్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. విజయవాడ, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరల, కాకినాడ పోర్ట్, ఏలూరు, గూడూరు, కావలి , మచిలీపట్నం , నిడదవోలు, నిడుబ్రోలు, నెల్లూరు, నర్సాపూర్, ఒంగోలు, పిఠాపురం, పాలకొల్లు, రాజమండ్రి, సింగరాయకొండ , సామర్లకోట, తాడేపల్లి, తెనాలి , తుని, ఎలమంచిలి స్టేషన్స్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

మూడు శాతం కమీషన్ గా ఇస్తారు
మొత్తం పోస్టుల సంఖ్య 59 కాగా 150 కిలోమీటర్ల వరకు గల టికెట్ ధరలో మూడు శాతం కమీషన్ ను వేతనంగా ఇస్తారు. పదోతరగతి చదివి ఉండాలి. 18 సంవత్సరాల వయసు నండివుండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లేదు. కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పూర్తిచేసిన దరఖాస్తులను Senior Divisional Commercial Manager's Office , North Block, DRM's Office Compound, South Central Railway , Vijayawada-1 లో అందజేయాలి. చివరి తేదీ జులై 15.

ATVM Notification for Railway Jobs in Vijayawada Division

కొన్ని స్టేషన్లలో రద్దీ చాలా తక్కువ
విజయవాడ, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరాల, కాకినాడ పోర్ట్, ఏలూరు, గూడూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడుబ్రోలు, నెల్లూరు, నరసాపూర్, ఒంగోలు, పిఠాపురం, పాలకొల్లు, రాజమండ్రి, సింగరాయకొండ, సామర్లకోట, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని, ఎలమంచిలి స్టేషన్లకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ పై టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తోపాటు మరికొన్నిరైల్వేస్టేషన్లలో ప్రస్తుతం ఏటీవీఎంలు పనిచేస్తున్నారు. అయితే ఇందులో పేర్కొన్నా కొన్ని రైల్వేస్టేషన్లలో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. వారికి ఆదాయాన్ని రైల్వే ఎలా చూపిస్తుంది అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+