ఆటో డ్రైవర్ నిజాయితీ: పది లక్షల సొత్తు తిరిగిచ్చేశాడు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని ప్రదర్సించుకున్నాడు. పది లక్షల రూపాయల విలువ చేసే సొత్తును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని అతను రుజువు చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరులోని ఇందిరానగర్‌కు చెందిన గునపాటి మురహరిరెడ్డి కృష్ణపట్నం పోర్టులో ట్రాన్స్‌పోర్టర్‌గా పని చేస్తున్నారు.
గురువారం హైదరాబాద్ నుంచి బస్సులో నెల్లూరు వచ్చిన ఆయన బాలాజీనగర్ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద దిగారు. అక్కడ నుంచి ఆటోలో బాలాజీనగర్ పుండరీకాక్షయ్య వీధిలో నివసించే స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అయితే, తన సూట్‌కేస్‌ను ఆటోలోనే మరచిపోయారు.

ఇంట్లోకి వెళ్లాక గమనించి వెంటనే బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌లో మురహరిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈలోపు ఆటోలో సూట్‌కేస్‌ను గమనించిన డ్రైవర్ రఘు దానిని బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించాడు. సూట్‌కేస్‌లో మూడు డైమండ్ రింగ్‌లు, రెండు, బంగారు ఉంగరాలు, ఇతర ఆభరణాలు, రూ.40వేలు, ల్యాప్ టాప్, మొబైల్‌ఫోన్ ఉన్నాయి.
బాలాజీనగర్ సీఐ చెంచురామారావు విషయాన్ని ఎస్పీకి తెలిపారు. దాంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విశాల్ గున్నీ సమక్షంలో ఆటో డ్రైవర్ ద్వారా ఆ సూట్‌కే్‌సను మురహరిరెడ్డికి అందజేశారు. అతడి నిజాయతీని మెచ్చుకొన్న మురహరిరెడ్డి రఘుకి రూ.5వేలు అందించారు.












Click it and Unblock the Notifications