Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాలేజ్ యువతిని టీజ్ చేశారు, నిలదీసిన తల్లిపై దాడి!

auto drivers booked for eve teasing
హైదరాబాద్: ఓ కాలేజీ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేయడంతో పాటు ఆమె తల్లిని వేధించినందుకు ముగ్గురు ఆటో డ్రైవర్ల పైన ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు అమ్మాయిని నిత్యం వేధిస్తున్నారు. ఇది తెలిసిన ఆమె తల్లి అడగటంతో ఆమె పైన దాడికి యత్నించారు.

నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితులు ఆ యువతిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక వేశారట. అయితే, వేధిస్తున్న విషయం తెలియగానే తల్లి వారిని నిలదీసింది. దీంతో వారు తల్లి పైన దాడికి యత్నించారు.

కాగా, హైదరాబాద్ నగర శివారులోని ఫారెస్టు ఏరియాలో గిరిజన యువతి సోమవారం అర్ధరాత్రి గ్యాంగ్ రేప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న ఆమెను బెదిరించి నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. పక్కనే ఉన్న భర్త, మరిదిని కొట్టి నిర్బంధించిన దుండగులు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన చెంచు కులానికి చెందిన మైసయ్య భార్య (20), తమ్ముడు తిరుపతి, మరికొందరు జీవనోపాధి కోసం వారం క్రితం నగరానికి వచ్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలో నివసిస్తున్న వీరు పరిచయమున్న శ్రీనివాస్ అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద పని కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలో అతని వద్ద సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న బాలస్వామికి వీరిని అప్పగించాడు. భువనగిరి ప్రాంతంలో ఉన్న జామతోటలో జరుగుతున్న మట్టి పనికి వెళ్లేందుకు సోమవారం రాత్రి బాలస్వామి ఏడుగురు కార్మికులతో ఉప్పల్ రింగ్‌రోడ్డుకు వచ్చారు. సూపర్‌వైజర్‌తో నల్గురు కార్మికులు ఆర్టీసీ బస్సులో వెళ్లిపోగా మైసయ్య, అతని భార్య, తమ్ముడు తిరుపతి రాత్రి 1.30కు ప్యాగో ఆటోను మాట్లాడుకుని భువనగిరికి బయలుదేరారు.

వరంగల్ జాతీయ రహదారిలోని నారపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే టాటా ఏస్‌లో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వీరి ఆటోను అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్‌ను బెదిరించి పంపించారు. భర్త మైసయ్య, మరిది తిరుపతిని కొట్టి ఆమెను పక్కనున్న నిర్మానుష్య ప్రాంతంలోకి బలవంతంగా తీసుకెళ్లారు.

భర్త, మరిదిని నిర్బంధించి చీకట్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు భర్త, మరిదితో మంగళవారం మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ఆగంతకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవి కిరణ్ రెడ్డి తెలిపారు.

అయితే అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడం గమనార్హం. కాగా కేసులో నారపల్లికి చెందిన ఐదుగురు అనుమానితులైన జుబేద్, శాన్యాజ్, రవి, అబ్బాస్, డింబూలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+