బాల బాబాయ్ త్వరగా కోలుకోవాలి: ఎన్టీఆర్ సంచలన ట్వీట్
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల అఖండ 2 తో అలరించిన బాలయ్య.. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబోపై సినీ ప్రియుల్లో నందమూరి అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకున్నాయి. #NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది.
ఈ మూవీ షూటింగ్ సమయంలో తాజాగా బాలకృష్ణకు స్వల్ప గాయం అయింది.కాకినాడ పోర్ట్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో బాలకృష్ణ మోకాలుకి స్వల్ప గాయం అయింది. ప్రమాదాన్ని గమనించిన చిత్ర బృందం వెంటనే షూటింగ్ ను నిలిపివేసింది. ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం బాలకృష్ణ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ వేర్వేరుగా ఎక్స్ లో పోస్టులు పెట్టారు.

ఈ మేరకు ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'బాల బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్ లో అదరగొట్టాలి' అని తారక్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే కల్యాణ్ రామ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. 'బాబాయ్.. మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. త్వరలోనే మీకు ఇష్టమైన సినిమా పనులు మళ్లీ ప్రారంభిస్తారని నాకు నమ్మకం ఉంది' అని కల్యాణ్ రామ్ రాసుకొచ్చారు. ఇక బాలయ్యకు గాయంపై చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించారు.
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
— Jr NTR (@tarak9999) July 21, 2026
"#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మజిల్ టియర్ అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం" అని తెలిపారు.












Click it and Unblock the Notifications