కాక్రోచ్ పార్టీలో తొలి వేటు- ఢిల్లీ నిరసనలకు డుమ్మా కొట్టి- షాకింగ్ వీడియోతో..!

ఓవైపు ఢిల్లీలో జరుగుతున్న నిరసనలతో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)లో ఇవాళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుమేరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధులు భారీ ఎత్తున తరలివచ్చి పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అయితే ఈ మార్చ్ కు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఓ సభ్యుడు మాత్రం ఈ నిరసనల్లో కనిపించలేదు. అతని పేరు విజేత దహియా (Vijeta Dahiya).

కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన విజేత దహియా నిన్న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ విద్యార్ధులు నిర్వహించిన మార్చ్ కు దరిదాపుల్లో కనిపించలేదు. అంతే కాదు ఢిల్లీలోని మరో ప్రాంతంలో జల్సా చేస్తూ కనిపించాడు. అతన్ని గుర్తుపట్టిన ఓ విద్యార్ధి దహియాను ఇక్కడ ఉన్నారేంటి అని ప్రశ్నించాడు. దీంతో విజేత దహియా సదరు విద్యార్ధిని జోకర్ గా అభివర్ణిస్తూ గేలి చేశాడు. దీంతో సదరు విద్యార్థి తాను తీసిన వీడియోలో నేను కాదు జోకర్. మిమ్మల్ని అందరినీ జోకర్లు చేస్తున్న మీరే జోకర్ అని కౌంటర్ ఇచ్చాడు.

CJP Removes Spokesperson Vijeta Dahiya After Controversial Videos Surface During Delhi Protest

ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. దీంతో విద్యార్ధులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమను ఢిల్లీ నిరసనలకు పిలిచిన కాక్రోచ్ పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొనకుండా ఎక్కడున్నారంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సహా ఇతర నేతలు కూడా ఇరుకునపడ్డారు. దీంతో వెంటనే అధికార ప్రతినిధిగా ఉన్న విజేత దహియాను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు కాక్రోచ్ పార్టీ ఇవాళ ఓ ట్వీట్ చేసింది. ఇందులో
శాంతియుత నిరసనకారులు, మా బృందం పోలీసుల అమానుష హింసను ఎదుర్కొంటున్న సమయంలో, మా ప్రతినిధి విజేత దహియాకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ప్రవర్తన అత్యంత అసంవేదనతో కూడుకున్నది, ఆమోదయోగ్యం కానిది, ఇది ఆయనకు విచక్షణ లేదని స్పష్టం చేయడమే కాకుండా, మా ఉద్యమ విలువలు, సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+