తెలంగాణా ఎకో టూరిజం.. ఇకపై సహజ సుందర పర్యాటక అద్భుతం!

తెలంగాణా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపైన ప్రభుత్వం బాగా ఫోకస్ పెడుతుంది. తెలంగాణాలో ఎకో టూరిజంను బలోపేతం చేయటం కోసం తెలంగాణా ప్రభుత్వం ఒక బృహత్తరమైన, విస్తృతమైన మాస్టర్ ప్లాన్ ను తయారుచేస్తోంది. ఈ కొత్త ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని సహజ సౌందర్యం నిండిన ప్రాంతాలను సమర్ధవంతంగా అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎకో టూరిజం కోసం సమగ్ర ప్రణాళిక తయారు చెయ్యాలని ఆదేశం

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ విషయంపై అధికారులతో సమీక్ష చేసి , సమగ్ర కార్యాచరణ తయారు చెయ్యాలని సూచించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం, నల్లమల అడవులు, ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర దట్టమైన అటవీ ప్రాంతాలలో ఎకో టూరిజం సౌకర్యాలను విస్తరించాలని ప్లాన్ చేశారు.

eco tourism in telangana Telangana govt is preparing comprehensive master plan for eco-tourism

కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని సూచన

ఈ ప్రాజెక్టులను అమలు చేస్తే స్థానిక యువతకు వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పర్యాటక ఆదాయం పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని, అలాగే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

ట్రెక్కింగ్, వైల్డ్ లైఫ్ సఫారీలు, ఎకో లాడ్జేస్ వంటి సౌకర్యాల అభివృద్ధి

ఫ్యూచర్ సిటీ, అనంతగిరి, వికారాబాద్ వంటి ముఖ్యమైన ప్రాంతాలలో పర్యాటక వసతులు కల్పించాలని, ట్రెక్కింగ్, వైల్డ్ లైఫ్ సఫారీలు, ఎకో లాడ్జేస్ వంటి సౌకర్యాలను అభివృద్ధి చేసి ప్రకృతి సంరక్షణకు పాటుపడాలని నిర్దేశించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చే సమన్వయం పెంచి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ చేస్తూ, ఎకో టూరిజం పనులు జరగాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.

తెలంగాణను దేశంలోనే అగ్రగామి ఎకో టూరిజం గమ్యస్థానంగా మార్చే ప్లాన్

ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా తెలంగాణను దేశంలోనే అగ్రగామి ఎకో టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన క్రమంలోని ఈ మేరకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్లాన్ ను విజయవంతంగా అమలు చేస్తే రాష్ట్రంలో సుందరమైన, సహజ సిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఆకర్షణీయ కేంద్రాలుగా మారి దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+