ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు పంచాయతీ తరువాత మరింత ముదిరిన అఖిలప్రియ,ఎవి సుబ్బారెడ్డి వివాదం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కర్నూలు:అయింది...అనుకున్నట్లే అయింది...టిడిపి నేతలు ఏదైతే జరగకూడదని భయపడడ్డారో అచ్చం అదే జరిగింది. ఇంతకీ విషయమేమిటంటారా?... ఉప్పు నిప్పుల మారిన మంత్రి అఖిల ప్రియ-ఎవి సుబ్బారెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. వీరిద్దరిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ చేసి నాలుగు రోజులన్నా కాలేదు అప్పుడే మళ్లీ గొడవలు మొదలైపోయాయి.

Recommended Video

'భూమా' కేడర్ ఎక్కడిది

పార్టీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాజీ చేశాక ఈ ఇద్దరు నేతలు కలసి పనిచేస్తారని, కనీసం విభేదాలు బైటపడకుండా కొంతకాలంగా అయినా సఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తారని, అలా కనిపించాలని టిడిపి నేతలు కోరుకున్నారు. లేనిపక్షంలో సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే పంచాయతీ చేసినా వీరి తీరులో మార్పు రాలేదంటే చంద్రబాబు మాటను ఆ పార్టీ నేతలు లెక్కచేయడం లేదనే మాటొస్తుందేమోనని భయపడ్డారు. వారు భయపడినట్లు అలాగే జరగడమే కాదు చంద్రబాబు తరువాత వీరి మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తాజాగా వీరు చేస్తున్న వ్యాఖల్యను బట్టి అర్థమవుతోందట. అవేంటంటే?...

ఎవి సుబ్బారెడ్డి...తాజా వ్యాఖ్యలు

ఎవి సుబ్బారెడ్డి...తాజా వ్యాఖ్యలు

పార్టీ పరువు బజారుకీడుస్తున్న అఖిల ప్రియ-ఎవి సుబ్బారెడ్డిల తగువుపై పంచాయతీ సందర్భంగా చంద్రబాబు వీరిద్దరి మథ్య విభేదాలు పరిష్కరించడానికే ప్రాధాన్యం ఇచ్చారు కాని వీళ్ల తగువుకు మూల కారణమైన సమస్య పరిష్కారం గురించి పట్టించుకోలేదట. దీంతో ఈ పంచాయతీలో ఎవి సుబ్బారెడ్డి మనస్థాపానికి గురికాగా, అఖిల ప్రియ కుటుంబం కూడా అసంతృప్తితోనే వెనుదిరిగారని టాక్. ఈ నేపథ్యంలో ఎవి సుబ్బారెడ్డి తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదం సద్దుమణగడం కాదుకదా మరింత ఉధృతం కాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందట...

తాజాగా సుబ్బారెడ్డి...ఏమన్నారంటే?...

తాజాగా సుబ్బారెడ్డి...ఏమన్నారంటే?...

తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎవి సుబ్బారెడ్డి ఏమన్నారంటే?...2019లో ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేయబోతోంది తానేనని, కాబట్టి గెలుపు మనదే కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారట. అందుకు ఇప్పటినుంచే ఒక ప్రణాళిక ప్రకారం మనం పనిచేసుకుంటూ పోవాలని తన క్యాడర్ కు సూచించారట. అయితే సహజంగానే ఈ వ్యాఖ్యలు అఖిలప్రియకు చేరవేసేవారు ఉంటారు కాబట్టి ఆమెకు ఎవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల గురించి సమాచారం అందిందట.

దీంతో అఖిల ప్రియ...రగిలిపోయింది...

దీంతో అఖిల ప్రియ...రగిలిపోయింది...

అసలే సుబ్బారెడ్డి వ్యాఖ్యలు, హెల్ప్ లైన్, పోటీ సైకిల్ యాత్ర వంటి చేతలతో విసిగిపోయిన మంత్రి అఖిల ప్రియ సిఎం చంద్రబాబు పంచాయతీ తరువాత కూడా మళ్లీ పాత పాటే పాడుతుండటం...సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను ఉండగానే తరువాత ఎన్నికలకు తనకంటే ముందుగా తానే సన్నాహాలు చేస్తుండటంపై రగిలిపోయారట. ఆళ్ళగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థానంలో నేనుంటే ఎవి సెబ్బారెడ్డి 2019లో ఆళ్ళగడ్డ టిక్కెట్‌ని అసలు ఎలా ఆశిస్తాడని ఆవేశంగా మాట్లాడినట్లు తెలిసింది. అసలు మా కుంబానికి చెందిన ఎమ్మెల్యే సీట్లపై పెత్తనం చేయడానికి ఎవి సుబ్బారెడ్డి ఎవరు, ఆయనకేమి సంబంధం అంటూ చాలా పరుషంగా మాట్లాడినట్లు తెలిసింది. ఈ తతంగం కూడా టిడిపి కార్యకర్తల సమక్షంలోనే జరిగినట్లు సమాచారం.

వివాదం...మొదటికి కాదు...తారా స్థాయికిదీంతో ఇక్కడి టిడిపి

వివాదం...మొదటికి కాదు...తారా స్థాయికిదీంతో ఇక్కడి టిడిపి

నేతలు ఏదైతే జరగకూడదని భావించారో అదే జరగడంతో వీరిద్దరి వ్యవహారం కారణంగా పార్టీ పరువు గంగలో కలసిపోతోందని, వీరి వ్యవహారం చంద్రబాబు ప్రతిష్టను కూడా బాగా దెబ్బతీస్తుందని మథనపడిపోతున్నారట. ఇక చంద్రబాబు వీరి వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా తీసుకొని వీరి మద్య తగువును పరిష్కరించలేని పక్షంలో వీరిద్దరి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లోని వర్గ పోరులపై ప్రభావం చూపి అవి చివరకు టిడిపిని, చంద్రబాబును భారీగా నష్టపరచడం ఖాయమని టిడిపి అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మరి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

English summary
Allagadda TDP leaders Akhila Priya and AV Subba Reddy once again starts fighting. Just three days ago CM Chandra babu made compromise between these two leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X