జగన్ ఇలాకాలో షాక్: గో బ్యాక్, మైక్ లాక్కున్నారు, వెళ్లిపోయిన అవినాశ్, బాబు రాకముందే కలకలం

Posted By:
Subscribe to Oneindia Telugu
  అవినాశ్ రెడ్డి మైక్ లాక్కున్న టీడీపీ !

  పులివెందుల: తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కంటే ముందే పులివెందులకు నీరు ఇచ్చి మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. కొందరు కోర్టుకు ఎక్కినా, కాంట్రాక్టర్లు మొండికేసినా వెనక్కి చూడకుండా గట్టిగా సంకల్పించి సాధించుకున్నామన్నారు.

  టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే ఫ్రశంస: యాత్రలో అత్యుత్సాహం, జగన్ చేయి పట్టుకొని పోలీస్ 'అల్లుడు'

  తనది ఉడుం పట్టు అన్నారు. కడప జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లెలో పైలాన్ ఆవిష్కరించి గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పులివెందులలో కూడా మాట్లాడారు.

  వైఎస్ ఘనత: అవినాష్ రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం

  వైసీపీకి పరోక్ష చురకలు

  వైసీపీకి పరోక్ష చురకలు

  తాను రాయలసీమకు నీళ్లు తెస్తుంటే కొందరు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఈ నీళ్లను చూసి వారు ఏం సమాధానం చెబుతారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. కొందరు అబద్ధాలు ఆడుతూ రాజకీయం చేయడం దారుణమన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతులకు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నానని, రాయితీలు ఇస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాకక్షలు ఉండేవని, వాటి నిర్మూలనకు తీవ్రస్థాయిలో ప్రయత్నించామని చంద్రబాబు అన్నారు. మొత్తం 19 లక్షల ఇళ్లు కడుతున్నామని, సంక్రాంతి తర్వాత 2.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పారు.

   అవినాశ్ చేతి నుంచి మైక్ లాక్కోబోయిన టీడీపీ కార్యకర్త

  అవినాశ్ చేతి నుంచి మైక్ లాక్కోబోయిన టీడీపీ కార్యకర్త

  పులివెందుల సభలో చంద్రబాబు మాట్లాడిన తర్వాత కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి మాట్లాడారు. గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం వైయసా రాజశేఖర రెడ్డి చొరవతోనే అమలుకు నోచుకుందని చెప్పడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆయనను వారించారు. ఆ సమయంలో అవినాశ్ చేతుల నుంచి సభా వేదికపై ఉన్న ఓ టీడీపీ నాయకుడు మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అలా చేయవద్దని వారించారు. ఆ తర్వాత అవినాశ్‌కు క్లాస్ పీకారు.

   చంద్రబాబు క్లాస్, వెళ్లిపోయిన అవినాశ్

  చంద్రబాబు క్లాస్, వెళ్లిపోయిన అవినాశ్

  అవినాశ్ రెడ్డి అలా మాట్లాడటంతో సభా ప్రాంగణంలో ఉన్న కొందరు కార్యకర్తలు కేకలు వేశారు. మరికొందరు కుర్చీలు చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో గందరగోళం చెలరేగింది. చివరకు ముఖ్యమంత్రి కలుగజేసుకొని రాజకీయాలకు అతీతంగా సభ జరగాలని కోరారు. చివరకు అవినాశ్ వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు.

   అవినాశ్ వెళ్లిపోవడానికి కారణం

  అవినాశ్ వెళ్లిపోవడానికి కారణం

  తొలుత చంద్రబాబు మాట్లాడారు. వేచి చూసిన అవినాశ్ రెడ్డి ఆ తర్వాత అనుమతి తీసుకొని మాట్లాడారు. కానీ గండికోట - చిత్రావతి ప్రాజెక్టుపై రాజకీయ అంశాలను సృషించగా గందరగోళం చెలరేగింది. చంద్రబాబు క్లాస్ తీసుకున్న తర్వాత కొందరు కుర్చీలు చేతుల్లోకి తీసుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరకు ఏం చేసేది లేక అవినాశ్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

   చంద్రబాబు రాకముందు కూడా కలకలం

  చంద్రబాబు రాకముందు కూడా కలకలం

  అంతకుముందు, ఉదయం కూడా పులివెందులలో స్వల్ప ఉద్రిక్తత కనిపించింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పార్టీ జెండాలతో వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను వారించారు. ఓ వాహనంపై వైసీపీ జెండా ఉండడంతో కొందరు దాడికి దిగే ప్రయత్నం చేశారు. తమ వారు కొందరు కనిపించడం లేదంటూ వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

   పోటాపోటీ ప్రదర్శన

  పోటాపోటీ ప్రదర్శన

  పులివెందుల, లింగాలలో సీఎం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితులు కనిపించాయి. అది వైయస్ కుటుంబం కంచుకోట కావడం, అధికార పార్టీ భారీ సభ తలపెట్టడంతో సర్వత్రా ఆసక్తి కనిపించింది. ఇరు పార్టీలు పోటాపోటీగా పార్టీ జెండాలు చేతబూని ప్రదర్శన చేశారు. తమ వారు కనిపించడం లేదని వైసీపీ నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం అందరికీ తెలియడంతో వైసీపీ కార్యకర్తలు జగన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు సర్దిచెప్పారు.

   ఎవరినీ కలవకుండా వెళ్లిన చంద్రబాబు

  ఎవరినీ కలవకుండా వెళ్లిన చంద్రబాబు

  కాగా, చంద్రబాబు అంతకుముందు కడప విమానాశ్రయానికి అరగంట ఆలస్యంగా వచ్చారు. ఉదయం గం.11.10 ని.లకు రావాల్సి ఉంది. కానీ గం.11.42కు వచ్చారు. సీఎంకు స్వాగతం పలికేందుకు మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు వచ్చారు. కానీ ఆలస్యం కావడంతో ఆయన ఎవరినీ కలవకుండానే హెలికాప్టర్‌లో పార్నపల్లెకు వెళ్లారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Embarrassing scenes were witnessed at the Janmabhoomi Mavooru public meeting in Pulivendula, home turf of the leader of the Opposition in Kadapa district on Wednesday. Telugu Desam leaders and also Chief Minister N. Chandrababu Naidu interrupted the speech of YSR Congress Member of Parliament Avinash Reddy as he attempted to praise YSR.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి