సిక్కిం, అరుణాచల్‌లో నిజమైన యాక్సిస్ ఎగ్జిట్‌పోల్స్

ఆంధ్రప్రదేశ్, ఒడిసా రాష్ట్రాలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం కౌంటింగ్ ఆదివారమే చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ను యాక్సిస్ మై ఇండియా సంస్థ శనివారం రాత్రి ఇండియాటుడేలో ప్రకటించింది. వాటిల్లో ఈ సంస్థకున్న కచ్చితత్వం మరోసారి నిరూపితమైంది.

అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 సీట్లకు గాను భారతీయ జనతాపార్టీ 44 నుంచి 51 సీట్లను గెలుచుకుంటుందని యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్ లో ప్రకటించింది. ఫలితాలు కూడా అవే వచ్చాయి. బీజేపీ 45 సీట్లను గెలుచుకుంటోంది. అంటే గతంకన్నా ఎనిమిది సీట్లను అదనంగా గెలుచుకోబోతోంది.

Axis My India Exit polls in Sikkim Arunachal is true

ఈరోజు సాయంత్రం ఏపీ, ఒడిసా పోల్
సిక్కింలో సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ 24 నుంచి 30 సీట్లను గెలుచుకుంటుందని యాక్సిస్ వెల్లడించింది. ఇప్పటివరకు సిక్కిం క్రాంతికార్ మోర్చా 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏపీ, ఒడిసా రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను యాక్సిస్ మై ఇండియా ఇంకా ప్రకటించలేదు. వీటిని ఆదివారం సాయంత్రం ప్రకటించబోతోంది.

గుంభనంగా ఉన్న ఏపీ ఓటరు
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవగా జాతీయ సర్వేలన్నీ తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిదే అధికారం అని తేల్చాయి. అలాగే స్థానికంగా ఉన్న సంస్థలు కొన్ని వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

ఓటర్ల నాడిని సరిగ్గా ఎవరు పసిగట్టారు అనే విషయంలో స్పష్టత రావడంలేదు. ఎందుకంటే ఓటు వేసిన ఏపీ ఓటరు గుంభనంగా ఉన్నాడు. ఎవరడిగితే వారికే వేశానని చెబుతున్నాడు. స్పష్టత రావడంలేదు. అత్యంత విశ్వసనీయత ఉన్న సంస్థలు గతంలో ఏం చెప్పాయి? ఎవరికి చెప్పాయి? వాటి నిజమైన ఫలితాలు ఎలా వచ్చాయి? ఇప్పటి ఫలితాలతో పోల్చి చూడొచ్చా? అనే కోణంలో నెటిజన్లు శోధిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+