ఆయేషా మీరా హత్య కేసు : సీబీఐ విచారణపై తల్లి అసహనం ! త్వరలో సుప్రీంలో పిటిషన్..
దశాబ్దం క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో రేప్, హత్యకు గురైన ఆయేషా మీరా కేసులో దోషుల్ని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తాజాగా దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ కూడా ముందుకెళ్లడం లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తల్లి షంషాద్ బేగం ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
అయేషా మీరా హత్యకు గురై 15యేళ్లు గడిచిన నేపథ్యంలో.. నిజమైన హంతకులను శిక్షించాలంటూ... న్యాయం కై ఇంకెన్నాళ్లు పేరుతో సమావేశం జరిగింది. ఇందులో మాట్లాడిన ఆమె తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు.
అయేషా హత్యకు గురై 15యేళ్లు అయ్యిందని, ఐపియస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆమె ఆరోపించారు. సత్యంబాబును అరెస్టు చేసినా కోర్టు లో దోషిగా నిర్ధారించలేదని తెలిపారు. 2018డిసెంబరులో సీబీఐ దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని, తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించారని షంషాద్ తెలిపారు.

తమ దగ్గర ఉన్న అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చామన్నారు. గతంలో మత పెద్దలు తమ కుమార్తె రీ పోస్ట్ మార్టంకు అంగీకరించ లేదని, ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని ఆమె వెల్లడించారు. మూడేళ్లుగా తమ పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదన్నారు. ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారన్నారు. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయిందన్నారు. అందుకే తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. అసలైన దోషులకు శిక్ష పడి, న్యాయం జరిగేలా ముందుకు సాగుతామని షంషాద్ వెల్లడించారు.
జగన్ తండ్రి వైయస్ సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని ఆమె కోరారు. నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలన్నారు.












Click it and Unblock the Notifications