చంద్రబాబును కలిసిన ఆయేషా మీరా తల్లి, 'ఆధారాలు సేకరిస్తున్నాం'
తన కూతురు ఆయేషా మీరా హత్య కేసును మళ్ళీ విచారించి, దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆయేషా తల్లి శుక్రవారం అన్నారు.
అమరావతి: తన కూతురు ఆయేషా మీరా హత్య కేసును మళ్ళీ విచారించి, దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆయేషా తల్లి శుక్రవారం అన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారితో కలిసి ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఇరువురు విలేకరులతో మాట్లాడారు.
ఆయేషా మీరా హత్య కేసులో సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పోరాడి గెలిచారని చంద్రబాబు అన్నారని చెప్పారు. హత్య కేసుపై మళ్లీ విచారణ జరగాలన్నారు.

అసలు దోషి తేలాల్సి ఉందని నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. ఈ కేసులో మహిళా కమిషన్ ఆధారాలను సేకరిస్తోందని చెప్పారు. కేసులో నిందితులను పట్టుకునేందుకు ఆయేషా కుటుంబంతో కలిసి పోరాటం చేస్తామనని రాజకుమారి అన్నారు.












Click it and Unblock the Notifications