'మాకంటే చంద్రబాబు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలానా', రోజా తీవ్ర ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్రం ఇచ్చిన నిధులు ఇవీ అంటూ లెక్కలు చెబుతూ, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలకు మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు మంగళవారం కౌంటర్ ఇచ్చారు.

'అనూహ్యంగా' పవన్ కళ్యాణ్‌కు జగన్ చెక్, బాబుకు నో 'ఛాన్స్'?

రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాయకులు తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా బీజేపీతో కలిసే ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

వాటిని నిరూపించాలి

వాటిని నిరూపించాలి

చంద్రబాబు పైన, ప్రభుత్వం పైన చేసే అవినీతి ఆరోపణలు సరికాదని అయ్యన్న అన్నారు. అవినీతి ఆరోపణలు చేసే వారు మొదట వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆయన బీజేపీ నాయకులు విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల పైన కూడా స్పందించారు.

విష్ణుకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు కూడా ఇవ్వరు

విష్ణుకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు కూడా ఇవ్వరు

విష్ణు కుమార్ రాజుది చిన్న పిల్లవాడి మనస్తత్వమని అయ్యన్న అన్నారు. విష్ణు కుమార్ రాజుకు ఇచ్చిన ప్రాధాన్యత తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు కూడా ఇవ్వరని వాపోయారు. అలాంటి విష్ణు టీడీపీపై విమర్శలు సరికాదన్నారు.

  MLA Roja on Chandrababu Naidu : బాబు కు నంది అవార్డు ఇవ్వండి !
   చంద్రబాబుపై ఎమ్మెల్యే విమర్శలు

  చంద్రబాబుపై ఎమ్మెల్యే విమర్శలు

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై వేరుగా నిప్పులు చెరిగారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల భయంతో ప్రత్యేక హోదాను సమాధి చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ విషయంలో టీడీపీ ఎంపీలు ఒకరకంగా, ఎమ్మెల్యేలు మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు.

  టీడీపీ - బీజేపీ వాగ్యుద్ధం

  టీడీపీ - బీజేపీ వాగ్యుద్ధం

  కాగా, బడ్జెట్ అనంతరం టీడీపీ, బీజేపీ మధ్య వాగ్యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఏపీకి అన్యాయం జరిగిందని, అలాగే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇవ్వలేదని టీడీపీ మండిపడుతుండగా, తాము హామీలను నెరవేర్చుతున్నామని బీజేపీ చెబుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam leader and minister Ayyanna Patrudu counter to BJP leader Vishnu Kumar Raju.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి