టిడిపిలోకి గంటా వార్తలు: బాబుతో అయ్యన్నపాత్రుడు

అనంతరం ఆయన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి అనకాపల్లి లోకసభ సీటు, తనకు నర్సీపట్నం అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. ఒకే కుటుంబానికి రెండు సీట్లు వద్దనుకుంటే తాను పోటీ ఆలోచనను విరమించుకుంటానని చెప్పారు. మంచివారిని పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు.
నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నవారిని పార్టీలోకి తీసుకుంటే మంచిదని, మూడు నాలుగు సార్లు పార్టీలు మారినవారిని తీసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి నీతిమంతులను ఆహ్వానించాలని ఆయన అన్నారు. తమ నాయకుడు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు గంటా శ్రీనివాస రావు కూతురు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications