పట్టాభి.. సజ్జలనంటే.. జగన్ అన్వయించుకున్నారు: అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి ఫైర్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సానుభూతి వస్తుందనుకుంటే జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని ఆయన దుయ్యబట్టారు. పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జల రామకృష్ణారెడ్డిని అని అయ్యాన్నపాత్రుడు తెలిపారు.
సానుభూతి కోసం జగన్ తననే అన్నారని ప్రచారం చేసుకుంటారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు వస్తాయని గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కూడా పట్టాభి తిట్టిన బోసిడీకే అన్న పదాన్ని జగన్ తనకు అన్వయించుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

అసలు బోసిడీకే అన్న పదం పెద్ద తిట్టే కాదన్నారు అయ్యన్నపాత్రుడు. తెలంగాణ పదకోశంలో బోసిడీకే అంటే 'పాడైపోయిన' అని అర్థం ఉందన్నారు. బోసిడీకే అనే పదానికి పెడర్థాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డుకు జగన్ బయటకు తీశాడని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తల్లిపై జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే తల్లిని తిట్టిన వారికి మంత్రి పదవి ఇవ్వడని.. తల్లిని, చెల్లిని తెలంగాణ రోడ్లపై అనాథగా వదిలేయడని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కాగా, పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటిపై, టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ పై విడుదల కావడం జరిగింది.
మరో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీ పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని అన్నారు. సీఎంకు ఒకటి, హైకోర్టు న్యాయమూర్తులకు మరో చట్టమా అనే ప్రశ్నను లేవనెత్తిందని గుర్తు చేశారు సోమిరెడ్డి.
Recommended Video
పోలీస్ వ్యవస్థపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థకు విలువేముంటుందన్నారు. తీవ్రమైన అభిశంసనపై కూడా డీజీపీ స్పందించట్లేదని, ఇది పోలీస్ శాఖ ప్రతిష్టకే మాయని మచ్చ అని ఆక్షేపించారు. డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే సముచితంగా ఉంటుందని సోమిరెడ్డి హితవు పలికారు.












Click it and Unblock the Notifications