Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యన్నపాత్రుడు వర్సెస్ విజయసాయి రెడ్డి: తిరుమలనూ వదలకుండా మరీ ఘాటుగా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుకి మధ్య చోటు చేసుకున్న ట్విట్టర్ వార్ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. సాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోయిన వ్యవహారాన్ని టీడీపీ నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఇక సాయిరెడ్డి మళ్ళీ ఎదురుదాడికి దిగుతున్న తీరు ఇటు సామాన్యులను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది.

తాజాగా అయ్యన్నపాత్రుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, జగన్ దుర్మార్గపు పాలన నుంచి ప్రజలను కాపాడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో ఆయన విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు.

Ayyannapatrudu vs Vijayasai Reddy: shocking twitter war

మొన్న విజయసాయి రెడ్డి పోలీసులకు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారని, విజయసాయిరెడ్డి ఫోను త్వరగా దొరకాలని తాను దేవుడిని వేడుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, విశాఖ భూ స్కామ్ ఆధారాలు ఆ ఫోన్ లో ఉన్నాయని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు, ఆ ఫోన్ దొరికితే సాయి రెడ్డి ఆస్తులు జప్తు అవుతాయి అంటూ చేసిన వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి మళ్ళీ అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు.

తీవ్ర పదజాలంతో అయ్యన్నపాత్రుడిని అరగుండు పాత్రుడు, గంజాయి పాత్రుడు అని టార్గెట్ చేసిన సాయిరెడ్డి తిరుమల వెళ్ళిన అయ్యన్నపాత్రుడిని తిట్టిపోశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనూ కాలెత్తిపోసే నీ కుక్క బుద్ధిని పోనిచ్చుకోలేదురా అరగుండు అంటూ అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. తన సన్నిధిలోనూ స్వామి నీకు ప్రశాంతత చేకూర్చలేదు గంజాయి పాతకుడా! అని నిప్పులు చెరిగారు. ఇక నీ జీవితం నర్సీపట్నం బస్టాండే అంటూ సాయిరెడ్డి అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేశారు.

ఇక తిరుమలలో తనపై చేసిన వ్యాఖ్యలపై మండిపడిన సాయిరెడ్డి అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది అంటూ మండిపడ్డారు. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్న విజయసాయి బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి అన్నది అయ్యన్న దుర్బుద్ధి అని పేర్కొన్నారు. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు అని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు దేవుడి దగ్గర కూడా తన దుర్బుద్ధి చూపించారని తిట్టిపోశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+