ప్రేమ వేధింపులే ప్రాణం తీశాయా?: అడవిలో శవమైన బీటెక్ విద్యార్థి చిరంజీవి
నెల్లూరు: జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి కావలి మండలంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. నాలుగు రోజుల క్రితం కావలిలో అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గంటల వ్యవధిలోనే మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే కళాశాలకు చెందినవారు కావడం గమనార్హం.
కావలి మండలంలోని కడనూతల ఫారెస్ట్ ఏరియాలో విద్యార్థి మృతదేహం మంగళవారం బయటపడింది. ఘటనా స్థలంలో లభించిన కళాశాల గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డులను బట్టి మృతుడు నాయుడుపేట మండలం విన్నమాలకు చెందిన వేలూరు చిరంజీవి (20)గా గుర్తించారు.
స్థానికులు, పోలీసులు, కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. విన్నమాలకు చెందిన వేలూరు చిరంజీవి కావలిలోని విశ్వోదయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(విట్స్) కళాశాలలో బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలకు చెందిన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తుండటంతో విద్యార్థిని తల్లిదండ్రులు కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మే 5వ తేదీన ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు అందడం, చిరంజీవి వ్యవహారశైలి సరిగా లేకపోవడంతో కళాశాల యాజమాన్యం అతడిని వసతిగృహం నుంచి బయటకు
పంపేసింది. దీంతో అతను కావలిలోనే గది అద్దెకు తీసుకుని పరీక్షలు రాస్తున్నాడు. ఈక్రమంలో మే 27వ తేదీన పరీక్ష రాయాల్సి ఉండగా గైర్హాజరయ్యాడు. అప్పటి నుంచి చిరంజీవి ఆచూకీ లేదు.
కాగా, అటవీప్రాంతంలో చిరంజీవి మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నీలిమ భర్త మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

హత్యా? ఆత్మహత్యా?
చిరంజీవిది హత్యా? లేక ఆత్మహత్యా అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, 27వ తేదీనే హత్య జరిగినట్లు సంఘటనా స్థలంలోని ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆరోజు వేకువన కావలి నుంచి పల్లెవెలుగు బస్సులో చిరంజీవి కడనూతల వచ్చినట్లుగా మృతుడి పర్స్‌లో టికెట్ లభించింది.
టికెట్‌పై ఉదయం 4.38గా సమయం నమోదైంది. కావలి నుంచి పల్లెవెలుగు బస్సులు ఉదయం 5గంటల నుంచి మాత్రమే ఉన్నాయి. వేకువనే 4.38గా సమయం నమోదై ఉందంటే బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం బస్సు వేచి ఉన్న సమయంలోనే టికెట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక, మృతుడి వద్ద ఫోన్ కూడా లభించలేదు. కేవలం ఇయర్‌ఫోన్స్ మాత్రం ఉన్నాయి. కాళ్లకు చెప్పులు కూడా లేవు. మృతదేహం పక్కన బైక్ చక్రాల గుర్తులున్నాయి.
మృతుడి జేబులో మూడు ఖాళీ నిద్ర మాత్రల షీట్లు (45 మాత్రలు, రెస్టిల్ 0.5ఎంజీ) లభించాయి. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కావలి నుంచి కడనూతల అటవీ ప్రాంతం వరకూ చెప్పులు కూడా లేకుండా రావాల్సిన అవసరం లేదని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా చిరంజీవిని ఇక్కడి వరకు తీసుకొచ్చి హత్యా చేశారా? అని సందేహిస్తున్నారు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
రెండూ అనుమానాస్పద సంఘటనలే
కావలి విట్స్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వేర్వేరు ఘటనల్లో గంటల వ్యవధిలోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం జిల్లాలో సంచలనంగా మారింది. మే 27వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతలో వసతిగృహం పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి మృతదేహం లభ్యమవడం ఆందోళన కలిగిస్తోంది.
నా బిడ్డను చంపేశారు: చిరంజీవి తల్లి
తన బిడ్డను చెప్పిమరీ చంపేశారని కడనూతలలో లభ్యమైన చిరంజీవి మృతదేహం వద్ద తల్లి పుష్ప కన్నీటి పర్యాంతమైంది. మంగళవారం రాత్రి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వచ్చి చిరంజీవి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోదించింది. నాయుడుపేటకు చెందిన రెడీమెడ్ షాపు యజమాని వాసు ఆయన అన్న వెంకటేశ్వర్లు పథకం ప్రకారం తన బిడ్డను కడతేర్చారని పుష్ప ఆరోపించింది. లేనిపోని ఆరోపణలతో తన బిడ్డను అంతం చేశారని వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె వేడుకుంది.
ఇది ఇలా ఉండగా.. కావలిలో మిద్దెపై నుంచి పడి మృతిచెందిన కాలేజీ విద్యార్థి ఘటనకు, మంగళవారం కడనూతల అటవీ ప్రాంతాల్లో లభ్యమైన చిరంజీవి మృతదేహం ఘటనకు ఎలాంటి సంబంధంలేదని కావలి రెండో పట్టణం సిఐ వెంకటరమణ చెప్పారు. కడనూతల ఘటనపై బిట్రగుంట పోలీ సుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని, దర్యాప్తు తర్వాత పుర్వాపరాలు వెల్లడవుతాయయని తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications