వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగల్ని కాపాడటంలో బిజీ: బాబు, రాహుల్‌కు కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Babu blames Congress and YSRCP
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ దొంగలను కాపాడటంలో బిజీ అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పుల ఊబిలో కూరుకున్న రైతులను వర్షం మరింత దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల రాష్ట్రంలో భారీగా పంట నష్టం జరిగిందని, అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు.

శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ప్రభావం పడిందని చెప్పారు. కాంగ్రెసు పదేళ్ల పాలనలో పద్దెనిమిదిసార్లు తుఫాను వస్తే కేంద్రం ఇప్పటి వరకు మూడువేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. నీలం తుఫాను బాధితులకే ఇప్పటి వరకు నష్ట పరిహారం ఇవ్వలేదని, ఫైలిన్ తుఫాను బాధితులను ఆదుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని మండిపడ్డారు.

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట వంటి కొన్నిచోట్ల ఎన్నడూ లేనంతగా వర్షం పడిందన్నారు. వర్షం బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిబంధలను పక్కన పెట్టి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దొంగలను కాపాడటంలో బిజీ అయ్యారని ఆరోపించారు. కాంగ్రెసు నేతలు బాధితులను వదిలేసి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విపత్కర సమయంలో ప్రభుత్వాల తీరు సరిగా లేదన్నారు.

బొగ్గు కుంభకోణం కేసులో తాను సిబిఐ దర్యాఫ్తును ఎదుర్కొంటానని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పడం సిగ్గు చేటన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సామాన్యులు, దేశ ప్రజలను వదిలేసి తనకు రక్షణ లేదని బాధపడటం విడ్డూరమన్నారు. ఎస్పీజి భద్రత ఉన్న రాహులే అలా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సామాన్యులు, మహిళల గురించి పట్టించుకోని రాహుల్ తన భద్రత విషయమై బాధపడుతున్నారన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌లను గవర్నర్ నరసింహన్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోనియా వాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే హైదరబాదులో సభ పెడుతున్నారని ఆరోపించారు.

బాబు పర్యటన

వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. రోజుకో జిల్లా చొప్పున శ్రీకాకుళం నుంచి ప్రకశం జిల్లా వరకు పర్యటిస్తారు. రెండో విడతగా తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has blamed Congress and YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X