కెసిఆర్‌తో భేటీ: లోకసభకు బాబూ మోహన్ పోటీ

తాను లోకసభ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు బాబూ మోహన్ కెసిఆర్‌తో భేటీ తర్వాత చెప్పారు. ఆయనను మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి కెసిఆర్ పోటీకి దింపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.
తాను మర్యాదపూర్వకంగానే కెసిఆర్‌ను కలిసినట్లు బాబూ మోహన్ చెప్పారు. గతంలో తనను శాసనసభ్యుడ్ని చేసింది కెసిఆరేనని ఆయన చెప్పుకున్నారు. తాను ఏ సీటు నుంచి పోటీ చేసేది బాబూ మోహన్ వెల్లడించలేదు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభా నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, తెరాస నేత జి. నగేష్ శనివారం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications