ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రపతికి నివేదన : 11 మందితో బృందం..!
ఢిల్లీలో దీక్ష నిర్వహించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివక్ష ను దీక్ష ద్వారా చాటిన ముఖ్యమంత్రి..ఢిల్లీ లో ప్రదర్శన నిర్వహించి ఆ తరువాత రాష్ట్రపతిని కలవా లని నిర్ణయించారు. పూర్తి వివరాలతో రాష్ట్రపతికి సీయం బృందం వినతి పత్రాన్ని సమర్పిస్తారు.
దీక్ష సక్సెస్..ఇక వడివడిగా..
ఏపి కి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు లో కేంద్ర నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఢిల్లీ లో చేసిన దీక్ష సక్సెస్ అయిందని టిడిపి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన దీక్షకు మద్దతుగా 32 మంది జా తీయ పార్టీల నేతలు తరలి రావటం ద్వారా దీక్ష జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందని చెబుతున్నారు. ప్రధాని మోదీ ని లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి, దీక్షకు మద్దతు గా వచ్చిన నేతలు ఫైర్ అయ్యారు.

రాత్రి వరకు దీక్ష చేసిన ముఖ్యమంత్రికి మాజీ ప్రధాని దేవగౌడ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు. దీంతో.. ఆగకుండా కేంద్రం పై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఢిల్లీ వీధుల్లో ముఖ్యమంత్రి తో పాటుగా ఏపి నుండి వెళ్లిన అన్ని సంఘాల ప్రతినిధుల తో కలిసి మార్చ్ నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ వీధుల్లో మార్చ్.. రాష్ట్రపతికి వినతి పత్రం..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మంగళవారం ఉదయం ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు మార్చ్‌గా వెళ్లనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్‌కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ఏపికి ప్రత్యేక హోదా.. విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజా సం ఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు.

రాష్ట్రపతి భవన్ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు. రాష్ట్రపతిని కలిసే బృందంలో ముఖ్య మంత్రితో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు- కళా వెంకట్రా వు, నక్కా ఆనంద్‌బాబు, అమరావతి ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం ఛైర్మ న్ చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఐకాస అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే అధ్య క్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఏన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ ప్రతినిధి శివాజీ ఈ బృందంలో ఉంటారు.












Click it and Unblock the Notifications