ఎన్టీఆర్ ఇలాకాలో వైయస్ జగన్‌కు చేదు అనుభవం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని స్వర్గీయ ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అత్యంత గోప్యంగా నిమ్మకూరు చేరిన జగన్ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీ రామారావు అభిమానులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.
జగన్ పూలమాల వేస్తే తాము ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో జగన్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాగా, జగన్ ఎన్టీ రామారావు బంధువు నందమూరి పెద వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లారు. తమ పార్టీలో చేరాలని జగన్ పెద వెంకటేశ్వర రావును కోరారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో నందమూరి పెద వెంకటేశ్వర రావుకు విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని వాడుకోవడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైయస్ జగన్ నిమ్మకూరు పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు.
అయితే, జగన్ నిమ్మకూరు వచ్చినట్లు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక్కసారిగా గుప్పుమంది. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున నిమ్మకూరు వచ్చారు. చిగురుపాటి బాబూరావు కుటుంబ సభ్యులకు మాత్రమే జగన్ రాక గురించి తెలుసునని అంటున్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications