వైసీపీ పతనం మొదలైంది: ఇదీ ఓ గెలుపేనా: రిగ్గింగ్ ఆరోపణలు చేసిన బీజేపీ
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎదురులేని మెజారిటీని సొంతం చేసుకుంది. నియోజకవర్గంలో ఉన్న ఓట్లను క్వీన్‌స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలి హోరు సునామీని తలపించింది. పాత రికార్డులు బదలయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బద్వేలు నియోజకవర్గంలో ఇదే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీకి రెట్టింపు ఓట్లు ఆ పార్టీకి పోల్ అయ్యాయి.

డాక్టర్ సుధ ఘన విజయం..
బద్వేలు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున డాక్టర్ దాసరి సుధ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాలమరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. కిందటి నెల 30వ తేదీన పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బరి నుంచి తప్పుకొంది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ రేసులో నిలిచాయి. టీడీపీ క్యాడర్ మొత్తం బీజేపీకి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

90 వేలకు పైగా మెజారిటీ..
ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధ.. కళ్లు చెదిరే మెజారిటీతో విజయదుందుభిని మోగించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,590లకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుమారుగా రెండు లక్షలకు పైచిలుకు ఉండే ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఓట్లను సాధించడం అనేది తిరుగులేని రికార్డుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేయనప్పటికీ.. ఆ పార్టీకి ఈ స్థాయిలో పట్టం కట్టారు బద్వేలు ఓటర్లు.

రిగ్గింగ్ ఆరోపణలు గుప్పించిన బీజేపీ..
బద్వేలులో వైసీపీ సాధించిన ఘన విజయంపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు గుప్పించింది. రిగ్గింగ్ ఆరోపణలు చేసింది. వైసీపీ నాయకులు రిగ్గింగ్ చేసి గెలిచారని ఆ పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం, రిగ్గింగ్ చేయడం వల్లే వైసీపీకి ఈ గెలుపు దక్కిందని ఆరోపించారు. 25 సంవత్సరాల యువకుడు, తమ పార్టీ అభ్యర్థి పనతల సురేష్‌ను ఓడించడానికి అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

పతనం ఆరంభం..
బద్వేలు ఉప ఎన్నిక గెలుపుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. రిగ్గింగ్ చేయడం, అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజల తీర్పును పక్కదారి పట్టించారని విమర్శించారు. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నాయకుల పప్పులు ఉడకబోవని హెచ్చరించారు. వైసీపీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆయన అన్నారు. వైసీపీ పరాజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications