వైఎస్ జగన్ మెజారిటీ బద్దలు: వైసీపీ ఎమ్మెల్యేల్లో టాపర్‌‌గా బద్వేలు సుధ: రెండో స్థానంలో సీఎం

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎదురులేని మెజారిటీని సొంతం చేసుకుంది. నియోజకవర్గంలో ఉన్న ఓట్లను క్వీన్‌స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలి హోరు సునామీని తలపించింది. పాత రికార్డులు బదలయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బద్వేలు నియోజకవర్గంలో ఇదే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీకి రెట్టింపు ఓట్లు ఆ పార్టీకి పోల్ అయ్యాయి.

డాక్టర్ సుధ ఘన విజయం..

డాక్టర్ సుధ ఘన విజయం..

బద్వేలు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున డాక్టర్ దాసరి సుధ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాలమరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. కిందటి నెల 30వ తేదీన పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బరి నుంచి తప్పుకొంది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ రేసులో నిలిచాయి. టీడీపీ క్యాడర్ మొత్తం బీజేపీకి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

90 వేలకు పైగా మెజారిటీ..

90 వేలకు పైగా మెజారిటీ..

ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధ.. కళ్లు చెదిరే మెజారిటీతో విజయదుందుభిని మోగించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,590లకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుమారుగా రెండు లక్షలకు పైచిలుకు ఉండే ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఓట్లను సాధించడం అనేది తిరుగులేన రికార్డుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేయనప్పటికీ.. ఆ పార్టీకి ఈ స్థాయిలో పట్టం కట్టారు బద్వేలు ఓటర్లు.

వైఎస్ జగన్ మెజారిటీ కంటే..

వైఎస్ జగన్ మెజారిటీ కంటే..

డాక్టర్ సుధ సాధించిన ఆధిక్యత.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మెజారిటీని దాటి పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్.. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా బద్వేలులో డాక్టర్ సుధకు లభించిన మెజారిటీ.. ఈ సంఖ్యను దాటి పోయింది. 90,590లకు పైగా ఓట్ల మెజారిటీని ఆమె అందుకోగలిగారు.

 వైసీపీ ఎమ్మెల్యేల్లో టాపర్..

వైసీపీ ఎమ్మెల్యేల్లో టాపర్..

రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151. కాగా- 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాలో ఇప్పటిదాకా వైఎస్ జగన్ టాపర్‌గా ఉన్నారు. ఇప్పుడాయన రెండో స్థానానికి దిగారు. ఆయన స్థానాన్ని డాక్టర్ సుధ ఆక్రమించుకున్నారు. పార్టీ అధినేత కంటే 480 ఓట్లను అధికంగా సాధించారు. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆమె టాపర్‌గా నిలిచారు.

 వైసీపీలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా ఇదే..

వైసీపీలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా ఇదే..

బద్వేలులో డాక్టర్ దాసరి సుధ 90,590 ఓట్ల తేడాతో గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. వైఎస్ జగన్ రెండో స్థానానికి దిగారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా రాంబాబు 81,035 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిలిచారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయనకు లభించిన మెజారిటీ 61,292. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారయణ రెడ్డి- 55,207 ఓట్లను సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+