బద్వేలులో వైసీపీ ఘన విజయం- 90వేల ఓట్ల మెజార్టీ : సీఎం ఆదేశించారు..పెద్దిరెడ్డి అమలు చేసారు..!!
వైసీపీ అంచనాలే నిజమయ్యాయి. బద్వేలు ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. మొత్తం 11 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ 90,089 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ 21,567 ఓట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ కు 6,191 ఓట్లు పోలయ్యాయి. నోట కు 3,629 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే, వైసీపీ అభ్యర్ధి విజయం పైన అధికారికంగా రిటర్నింగ్ అధికారి ప్రకటన చేయాల్సి ఉంది.

తొలి నుంచి పదో రౌండ్ వరకు ప్రతీ సారీ
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధను వైసీపీ తమ అభ్యర్దిగా బరిలోకి దించింది. ఇక, ఈ ఎన్నికల్లో టీడీపీ - జనసేన పోటీ చేయలేదు. కాంగ్రెస్ - బీజేపీ తమ అభ్యర్ధులను రంగంలోకి దింపాయి. తొలి నుంచి వైసీపీ ఈ ఎన్నికలో భారీ మెజార్టీ లక్ష్యంగా పని చేసింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది.

తొలి నుంచి సీఎం వ్యూహాత్మకంగా
ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దిని ఖరారు చేసిన వెంటనే ఎన్నికల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ప్రతీ మండలానికి ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. 2019 లో సాధించిన 45 వేల మెజార్టీ కంటే రెట్టింపు సాధించాలని నిర్దేశించారు. అందు కోసం మంత్రులు..ఎమ్మెల్యేలు బద్వేలులో ఇంటింటి ప్రచారం చేసారు. సీఎం జగన్ తాను కరోనా కారణంగా రాలేకపోతున్నానని..నవరత్నాల పధకాలను వివరిస్తూ..ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. పార్టీ అభ్యర్ధి దాసరి సుధను గెలిపించాలని అభ్యర్దించారు.

ఏకపక్షంగా వైసీపీ అభ్యర్ది ఆధిక్యత
ఇక, ఈ పోలింగ్ లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. పోటీ చేసిన బీజేపీ..కాంగ్రెస్ అభ్యర్ధులు ఎక్కడా వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతీ రౌండ్ లోనూ వైసీపీ ఆధిక్యత నిరూపించుకుంది. సీఎం నిర్దేశించిన విధంగానే భారీ మెజార్టీ సాధించటంలో మంత్రి పెద్దిరెడ్డితో పాటుగా పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీ 85,505 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ ఎన్నికల్లో 9వ రౌండ్ వరకు మొత్తం 1,26,688 ఓట్లు లెక్కించారు. అందులో వైసీపీ 96,036 ఓట్లు దక్కించుకోగా, బీజేపీ 19,029 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 5,519, నోట 3,179 ఓట్లు పోలయ్యాయి.

ప్రతీ గ్రామంలోనూ వైసీపీ ఆధిక్యం
9వ రౌండ్ వరకు వైసీపీ ఆధిక్యత 77,007 గా ఉంది. 8వ రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్‌కు 774 ఓట్లు పోలయ్యాయి. 68,492 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఏడో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 74991 ఓట్లు దక్కించుకుంది. ఆరో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్‌కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్ వైఎస్సార్‌సీపీ 64,265 ఓట్లు సాధించింది.

9వ రౌండ్ కే తేలిపోయిన ఫలితం
రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ నిలిచింది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. అయితే, పోలింగ్ రోజు నాడు మాత్రం బీజేపీ నేతలు వైసీపీ పైన విమర్శలు చేసారు. బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసారు. అయితే, టీడీపీ నేతలను తమ పార్టీ ఏజెంట్లుగా కూర్చోబెట్టారంటూ వైసీపీ నేతలు బీజేపీని టార్గెట్ చేసారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications