కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బద్వేలు బైపోల్: బీజేపీ వెనుక చంద్రబాబే: అసత్య ప్రచారాలంటూ పవన్ కళ్యాణ్ పై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: బద్వేలు ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం.. ప్రజా విజయమని, ప్రజలను నమ్ముకున్న పార్టీ తమదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బద్వేలు ఉపఎన్నికలో విజయం అనంతరం మంగళశారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ వెనుక చంద్రబాబే..: శ్రీకాంత్ రెడ్డి

బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ వెనుక చంద్రబాబే..: శ్రీకాంత్ రెడ్డి

బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబే అని దుయ్యబట్టారు శ్రీకాంత్ రెడ్డి. ఈ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయని విషయం తెలిసిందే. క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

జగన్‌కు అందుకే పట్టం కడుతున్నారు: శ్రీకాంత్ రెడ్డి

జగన్‌కు అందుకే పట్టం కడుతున్నారు: శ్రీకాంత్ రెడ్డి


ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారు' అని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం పెడతామని వైసీపీ మొదట్నుంచీ చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూనే ఉందన్నారు. ప్రజల తీర్పును అగౌర పర్చడాన్ని విపక్షాలు మానుకోవాలని హితవు పలికారు శ్రీకాంత్ రెడ్డి. బద్వేలు ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 90వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

డాక్టర్ సుధకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు

డాక్టర్ సుధకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు


కాగా, సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం జగన్‌ అభినందించారు. అలానే చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సుపరిపాలన, ఆయన అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు డాక్టర్ సుధ. తన విజయానికి సహకరించిన వైసీపీ నేతలకు, బద్వేల్‌ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి సుధ ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు.
బద్వేల్‌లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం సాధించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్‌ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా, డాక్టర్ సుధకు వచ్చిన మెజార్టీ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి 90,110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75243 ఓట్ల మెజార్టీ వచ్చింది. సుధకు ప్రస్తుతం 90,533 ఓట్ల మెజార్టీ వచ్చింది.

English summary
Badvel bypoll ysrcp win: Srikanth reddy slams chandrababu and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X