బాలయ్యకు షాక్.. NBK 108 యూనిట్ కు ప్రమాదం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సినిమా నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బాలయ్యను విభిన్న కోణంలో చూపించేలా అనిల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సజావుగా షూటింగ్ జరుపుకుంటున్న సీనిమా యూనిట్ కు చిన్న బ్రేక్ పడింది. ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనం అనుకోని ప్రమాదానికి గురైంది.
NBK 108 షూటింగ్‌లో పాల్గొనడానికి జూనియర్ ఆర్టిస్టులున్న వెహికల్ వెళుతున్నారు. ఈ తెల్లవారు జామున బండి ప్రమాదవశాత్తు తిరగబడగా, నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. బాచుపల్లి దగ్గర ప్రగతి నగర్ చెరువు సమీపంలో ఈ వాహనం బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

NBK 108 ప్రారంభానికి ముందు కథానాయిక ఎవరనే విషయమై వార్తలు వచ్చాయి. అయితే సోనాక్షి సిన్హా పేరు వినిపించినప్పటికీ వాటిల్లో నిజం లేదని ఆమె సోషల్ మీడియాద్వారా స్పష్టత ఇచ్చింది. ఆ తర్వాత ప్రియాంక జువాల్కర్ ను కథానాయికగా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరో హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతూరుగా నటించబోతోంది.
ప్రియాంక టాక్సీవాలా, ఎస్.ఆర్.కళ్యాణ మండపం సినిమాల్లో నటించింది. కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సమయంలో బాలకృష్ణ సినిమాలో నటించబోతుండగా దీని తర్వాత ఆమెకు అదృష్టం కలిసివస్తుందంటున్నారు. ప్రధాన హీరోయిన్ ఈమేనా? లేదంటే మరెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు అని వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాతే దీనిపై ఒక స్పష్టత రాబోతోంది.












Click it and Unblock the Notifications