బాలకృష్ణ దృష్టి సారించారు, 20 వేల మందికి ఉపాధి: బాబు

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. చిలమత్తూరు మండలం కొడికొండలో రాగ మయూరి ఎలక్ట్రానిక్‌ హబ్‌కు ఆయన గురువారంనాడు శంకుస్థాపన చేశారు.

ఎలక్ట్రానిక్‌ పార్క్‌ ఏర్పాటుతో నేరుగా 10వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకో 10వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సమస్యలను అవకాశాలుగా తీసుకుని ముందుకెళ్తామని ఆయన అన్నారు. ఆగస్టు నాటికి మడకశిరకు హంద్రీనీవా నీళ్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే కాకుండా లేపాక్షి బయోటెక్నాలజీ పార్కుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

Balakrishna concentrated on Hindupur: Chandrababu

అనంతపురం జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చే బాధ్యత తీసుకున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా కొడికొండలో జరిగిన బహిరంగ సదస్సులో ఆయన మాట్లాడారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉన్నందున మనకు అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. ఆగస్టు నాటికి మడకశిర వరకు హంద్రీనీవా నీరు వస్తాయన్నారు.

అంతకు ముందు చంద్రబాబు నాయుడు హంద్రీనీవా రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జూన్‌లోగా మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+