ఏపీలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కేసీఆర్‌కు థ్యాంక్స్: బాలకృష్ణ
విజయవాడ: గవర్నర్‌పేటలో ఇండో అమెరికన్ క్యాన్సర్ క్లినిక్, సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు.
నవ్యాంధ్ర రాజధానిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఆగస్టు నెలలో భూమిపూజ నిర్వహిస్తామని తెలిపారు. 15 ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. ఎన్టీఆర్ పుట్టినగడ్డపై ఆసుపత్రి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

తన తల్లి పడిన బాధ ఎవరూ పడవద్దనే ఎన్టీఆర్ ఆసుపత్రిని ప్రారంభించారని గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. మా సేవలు గుర్తించి పన్ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్నారు.












Click it and Unblock the Notifications