చంద్రబాబుతో భేటీ, పీఏకు బాలకృష్ణ షాక్! తమ్ముళ్ల ఒత్తిడితో తొలగింపుకు రెడీ

హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

విజయవాడ: హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తన పీఏ శేఖర్ వ్యవహారమై చర్చించి, ఆయనను తొలగించాలని వారు ఇరువురు నిర్ణయించారని తెలుస్తోంది.

బాలకృష్ణ పీఏ వ్యవహారం గత కొద్ది రోజులుగా హిందూపురంలో హాట్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆయనను తొలగించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ కావడం గమనార్హం.

Balakrishna meets Chandrababu, PA may removed

ఈ సందర్భంగా పీఏ చంద్రశేఖర్‌ను తొలగించాలనే నిర్ణయించారు. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు, నేతలు ఆయన ఉండవద్దని ఇప్పటికే బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలో తగ్గక తప్పటం లేదని అంటున్నారు.

మరోవైపు, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తామని బాలకృష్ణ సోమవారం నాడు చెప్పారు. దీని పైన కూడా చంద్రబాబు - బాలకృష్ణల మధ్య చర్చ జరిగింది. ఎన్టీఆర్ సన్నిహితులు, సమకాలీనులతో ఈ విషయమై చర్చించాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించారు. అలాగే, నియోజకవర్గ పనుల పైనా చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+