బాలకృష్ణ కొత్త పిఎగా వీరయ్య నియామకం, ఎట్టకేలకు శేఖర్ పై వేటు
సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నూతన పి.ఎగా బి.వీరయ్యను నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గతంలో శేఖర్ పిఎగా కొనసాగాడు.అయితే శేఖర్ తీరుపై పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయనను పక్క
అమరావతి:సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన పి.ఎ గా బి. వీరయ్యను నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం నాడు 503 జివోను జారీ చేసింది ఎపి ప్రభుత్వం.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ వ్యవహరాలతో పాటు, ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను పిఎ చూసుకొంటాడు.అయితే పిఎ శేఖర్ వ్యవహరశైలిపై హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు ఫిర్యాదులు చేయడంతో శేఖర్ ను పక్కన పెట్టారు.

శేఖర్ స్థానంలో బి. వీరయ్యను నియమించుకొన్నాడు బాలకృష్ణ.సచివాలయంలోని ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్న వీరయ్యను బాలకృష్ణ పి.ఎ. గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
శేఖర్ వ్యవహరశైలితో బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై కృష్ణమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి పార్టీ నాయకుల అభిప్రాయాలను కూడ సేకరించింది. చివరకు శేఖర్ ను పార్టీ పక్కన పెట్టింది.












Click it and Unblock the Notifications