క్రికెట్ ఆడి సందడి చేసిన బాలకృష్ణ

Subscribe to Oneindia Telugu

అనంతపురం: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం క్రికెట్‌ ఆడారు. తన నియోజకవర్గం హిందూపురంలో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆయన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

 Balakrishna plays cricket with youngsters

స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో బసవతారకరామ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీని ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు యువకులతో కలిసి క్రికెట్‌ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఆయన ఆడుతున్నంతసేపు అభిమానులు జై బాలయ్య అంటూ కేకలు వేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడలు ఎంతో తోడ్పడతాయన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nandamuri Balakrishna was in Hindupur, the constituency he represents as MLA, to kick start the Basavatarakam Memorial Cricket Tournament. After unveiling the tournament, the 'Jai Simha' actor played cricket with youngsters for some time and encouraged them with his participation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి