చంద్రబాబుకే సాధ్యం: ఎన్టీఆర్ కల నెరవేరిందంటూ బాలకృష్ణ

Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశంసల కురిపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని బాలకృష్ణ కొనియాడారు.

హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడంతో ఎన్టీఆర్‌ కల నెరవేరిందన్నారు. అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలున్నా.. నీరు లేకపోవడంతో రాయలసీమ వెనకబడిపోయిందని బాలకృష్ణ అన్నారు.

balakrishna praises CM Chandrababu 2016

నీటిని విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేశారు.

వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు నీటిని కిందికి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLA Nandmuri Balakrishna on Friday praised AP CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...