వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పా సోదరులను నడిరోడ్డుపై వదిలేస్తే: బాలకృష్ణ, అఖిలప్రియకు ప్రశంస

ఆనాడు శిల్పా సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలను నడి రోడ్డుపై వదిలేస్తే వారిని తెలుగుదేశం పార్టీ ఆదరించిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఆనాడు శిల్పా సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలను నడి రోడ్డుపై వదిలేస్తే వారిని తెలుగుదేశం పార్టీ ఆదరించిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

పవన్ కళ్యాణ్ అందుకే మద్దతివ్వట్లేదు, మా ఆలోచనా అదే: అఖిలప్రియ సోదరిపవన్ కళ్యాణ్ అందుకే మద్దతివ్వట్లేదు, మా ఆలోచనా అదే: అఖిలప్రియ సోదరి

ఆ రెండు పదవులు ఇచ్చినా

ఆ రెండు పదవులు ఇచ్చినా

శిల్పా చక్రపాణి రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉన్నతంగా గౌరవించామని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు మాత్రం శిల్పా పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాడన్నారు.

నడిరోడ్డుపై వదిలేసిన పార్టీ పంచనే చేరారు

నడిరోడ్డుపై వదిలేసిన పార్టీ పంచనే చేరారు

నడి రోడ్డుపై వదిలేసిన పార్టీ పంచనే చేరి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారని బాలకృష్ణ దుయ్యబట్టారు. వారికి ఓటర్లే గుణపాఠం చెప్పాలన్నారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

అఖిలప్రియకు కితాబు

అఖిలప్రియకు కితాబు

దివంగత భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా సమర్థంగా పని చేస్తున్నారని బాలకృష్ణ కితాబిచ్చారు. ఆమె తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, తాత ఎస్వీ సుబ్బారెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబాలతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు.

జగన్‌వి హంస మాటలు, చేష్టలు కోతిలా

జగన్‌వి హంస మాటలు, చేష్టలు కోతిలా

కాగా, బుధవారం నంద్యాలలో పర్యటించిన బాలకృష్ణ వైసిపి అధినేత జగన్‌పై నేరుగా మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే. తనకు డబ్బు, పేపర్, టీవీ లేవని చెబుతున్నారని, మరి ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు ఎవరివి అని ప్రశ్నించారు. ఆయన మాటలు హంస మాటలు, చేతలు కోతి చేష్టలు అన్నారు.

English summary
Hindupuram MLA and Actor Nandamuri Balakrishna praised minister Bhuma Akhila Priya and lashed out at YSR Congress Party MLA candidate Silpa Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X