బాబు నుంచి బీ ఫారం తీసుకుంటూ బాలకృష్ణ (పిక్చర్స్)
హైదరాబాద్: నందమూరి హీరో బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమై పోయింది. ఆయన పోటీ చేసే స్థానం కూడా ఖరారైంది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా ఆయన బీ ఫారం అందుకున్నారు. సోమవారం ఆయన బీ ఫారమ్ తీసుకున్నారు.
బాలకృష్ణ ఈ నెల 16వ తేదీన హిందూపురం శాసనసభా స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. లెజెండ్ సినిమా విజయంతో ఊపు మీదున్న బాలకృష్ణ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధపడ్డారు. తన తండ్రి ఎన్టీ రామారావును ఆదరించిన హిందూపురం ప్రజలు తనను కూడా ఆదరిస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
హిందూపురం శాసనసభ్యుడు ఘనీని, ఆయన అనుచరులను ఒప్పించి చంద్రబాబు బాలకృష్ణకు టికెట్ ఖరారు చేశారు. ఈ సీటును బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా ఆశించినట్లు చెబుతారు.

బాబు నుంచి బాలకృష్ణ బీ ఫారం 1
నందమూరి హీరో బాలకృష్ణ సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నుంచి భీ ఫారం తీసుకున్నారు.

బాబు నుంచి బాలకృష్ణ బీ ఫారం 2
హిందూపురం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ద్వారా బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.

బాబు నుంచి బాలకృష్ణ బీ ఫారం 3
తండ్రి ఎన్టీ రామారావును ఆదరించిన హిందూపురం ప్రజలు తనను ఆదరిస్తారని, తండ్రి వారసత్వాన్ని స్వీకరించాలని బాలకృష్ణ తహతహలాడుతున్నారు.

బాబు నుంచి బాలకృష్ణ బీ ఫారం 4
బాలకృష్ణ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు చివరి వరకు ఉత్కంఠ కొనసాగించారు. హిందూపురం టికెట్ వద్దని చంద్రబాబు ఓ సమయంలో బాలయ్యకు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications