హిందూపురం అద్దె ఇంట్లోకి బాలకృష్ణ, త్వరలో సొంతిల్లు
అనంతపురం: స్థానికంగా ఉంటూ ప్రచారం నిర్వహించాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శుక్రవారం ఉదయం గృహప్రవేశం చేశారు. హిందూపురంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణపై స్థానికేతరుడంటూ ప్రత్యర్థులువిమర్శలు సంధించడంతో ఆయన హిందూపురలో ఓ అద్దె ఇళ్లును తీసుకున్నారు.
త్వరలోనే హిందూపురంలో సొంత ఇల్లు తీసుకోనున్నట్లు బాలయ్య తెలిపారు. హిందూపురం ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని బాలయ్య అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. బాలకృష్ణ భార్య వసుంధర కూడా ప్రచారంలోకి దిగారు.

సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో స్థలంకొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే ఇంట్లో నియోజకవర్గ పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఓ వైపు ఇల్లు, మరో వైపు పార్టీ కార్యాలయానికి అనుకూలంగా ఉండేలా ఈ ఇంటిని నిర్మించబోతున్నారట.
ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తానని, నియోజకవర్గంలో లేని సమయంలో కార్యదర్శి ద్వారా పనులు సమీక్షిస్తానని బాలయ్య స్థానికులకు మాట ఇస్తున్నారట. హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడంతో తన గెలుపు ఖాయమనే ధీమాతో బాలయ్య ఉన్నారు.












Click it and Unblock the Notifications