అమరావతిలో 200 ఎకరాలు కొన్న బాలయ్య..? ఇందులో వాస్తవమెంత..?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావ మరిది నందమూరి బాలకృష్ణ అమరావతిలో 200 ఎకరాలు కొనుగోలు చేశారని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అటు రాష్ట్రంలోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధాని అమరావతిలోనే ఈ భూమిని బాలయ్య కొనుగోలు చేశారని జోరుగా ప్రచారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు బావ మరిది కావడంతో ఈ చర్చ రాష్ట్రవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. అటు వైసీపీ వర్గాలు బాలకృష్ణ.. అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తోంది. దీంతో ఇందులో వాస్తవమెంత ? అన్న ప్రశ్న ప్రజల్లో పెరుగుతోంది.

నందమూరి బాలకృష్ణ అమరావతికి సమీపంలోని పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల్లో భూములు కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. వీటిని ప్రభుత్వం త్వరలో సేకరించబోతోందని తెలిసి.. బాలయ్య ముందుగానే భూములు కొని లాభపడే ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. అటు వైసీపీ కూడా ఇదే వ్యవహారాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే బాలయ్య మద్దతుదారులు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయని.. కొత్తగా అక్కడ భూములు కొనడం అనే అంశం సరికాదని అంటున్నారు.

మరోవైపు బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ ఆసుపత్రిని నడుపుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని బాలయ్య మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. అమరావతి అభివృద్ధిపై బురద చల్లడానికి కొందరు కావాలని సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారాలు ప్రారంభించారని మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లు బాలయ్య 200 ఎకరాలు ఎక్కడా కొనలేదని.. కావాలంటే రెవెన్యూ వెబ్ సైట్ లో బాలకృష్ణ పేరు మీద ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.

Balakrishna Reportedly Buys 200 Acres in Amaravati

ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే బాలయ్య బర్త్ డే కానుకగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తోంది. మరోవైపు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+