ప్రజల కోసం శ్రమిస్తా: రెండో రోజు హిందూపురంలో బాలకృష్ణ

అనంతపురం: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా శ్రమిస్తామని సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపూరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పేర్కొ న్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం నిర్వహించి న రెండో రోజు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి ఆయన విజ్ఞప్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. నాన్న ఎన్టీఆర్‌ ప్రారంభించిన ప్రజదర్బార్‌ నిర్వహిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళతానని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపి ప్రజలకు మరింత చేరువవుతామని బాలకృష్ణ చెప్పారు.

Balakrishna says he will work for public

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. హిందూపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కేవలం ప్రజాప్రతినిధులతోనే సాధ్యం కాదని, అధికారులు సహకరిస్తేనే సాధ్యమ న్నారు.

రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మొత్తం 1970 ఫిర్యాదులందాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఆధికారులు పాల్గొన్నారు. గురువారంనాడు కూడా ఆయన హిందూపురంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+