మహానాడు: పోలీసులతో బాలకృష్ణ గొడవ, వివరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ మహానాడు వేదికగా వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపివేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు.
దీంతో ఆయన వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతను మహానాడు మెయిన్ గేటు వరకూ కారులోనే వెళ్లారు. అక్కడ ఓ పోలీసు అధికారిని గద్దించినట్లుగా కూడా తెలుస్తోంది.

అభిమానులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం వల్ల, తనకు రక్షణంగా ఎక్కువ మంది లేకపోవడంతో ఆయన కారును మెయిన్ గేటు వరకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులకు తాను చెప్పానని, అంతేకాని తాను ఎవరినీ తిట్టలేదని బాలయ్య వివరణ ఇచ్చారు. కాగా, మహానాడులో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కాగా, తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు బుధవారంనాడు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. యేటా టిడిపి మహానాడు ఇవే తేదీల్లో జరుగుతాయి. వేదికపై తెలంగాణకు చెందిన కాకతీయ స్తూపం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలను ఉంచారు.












Click it and Unblock the Notifications