టిలోను: బాలకృష్ణ, పురంధేశ్వరిలా.. 'ప్రచారం'పై సస్పెన్స్
హైదరాబాద్/కరీంనగర్: తాను తెలంగాణ ప్రాంతంలోను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ గురువారం తెలిపారు. లెజెండ్ సినిమా విజయవంతమైన సందర్భంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఆయన ఉదయం కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో తాను తెలంగాణలోను ప్రచారం చేస్తానని ప్రకటించారు. తాను పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు.

ప్రచారానికే పరిమితమా?
తాను పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని బాలయ్య చెప్పడం ద్వారా కొత్త వాదనకు తెరలేపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని బాలయ్య పలుమార్లు చెప్పారు. ఎప్పుడు పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదనటం... ఎక్కడి నుండి పోటీ చేయాలనా? లేక లెజెండ్ హిట్ ద్వారా సినిమాలకే పరిమితం కావాలనే ఉద్దేశ్యమా? అనేది తేలాల్సి ఉంది.
ఈ ఎన్నికల్లో బాలకృష్ణ కేవలం ప్రచారానికే పరిమితం అయిపోతారా? అనే చర్చ తాజాగా సాగుతోంది. బిజెపి, టిడిపి పొత్తు నేపథ్యంలో పలువురు ఆశావహులకు టిక్కెట్లు లభించలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదని కొత్తగా తెర పైకి వచ్చింది. ఇప్పటికే బిజెపిలో ఉన్న పురంధేశ్వరికి సీటుపై గందరగోళం నెలకొంది. ఆమె పోటీ చేస్తారా? ప్రచారానికే పరిమితం అవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఆ ఉత్కంఠకు తెర లేచింది.












Click it and Unblock the Notifications