బాలాంత్రపు రజనీకాంత రావు కన్నుమూత
విజయవాడ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం రిటైర్డ్ సంచాలకులు బాలాంత్రపు రజనీకాంత రావు ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 99 ఏళ్లు.
ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. ఆకాశవాణి, దూరదర్శన్‌లో పని చేశారు. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు రజనీకాంత రావు ఒకరు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా అలరించారు.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయకులు, వాగ్గేయకారులు. 1947 ఆగస్టు 15న ఆయన స్వయంగా రచించిన మోగించి జయభేరీ.. వాయించు నగారా గీతం ఆకాశవాణి నుంచి ప్రసారమైంది.
మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి అనే దేశ భక్తి గేయాన్ని రాశారు. బాలాంత్రపు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications