ఎవరి పని వాళ్లే చూస్కోవాలి: గంటాపై బాలరాజు ఆగ్రహం

తనకు రచ్చబండపై సమాచారం విషయమై గంటా మాట్లాడినట్లుగా తాను మీడియాలో చూశానని కానీ, అది ఆయన ఉద్యోగం కాదని తెలుసుకోవాలన్నారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నారు. తనంతట తానే ఈ విషయం చెబుతున్నారా లేక ముఖ్యమంత్రి చెప్పమంటే చెబుతున్నావా అని ప్రశ్నించారు.
ఇటీవల విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఇది రగడకు దారి తీసింది. కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి తనకు ఎలాంటి సమాచారం లేదని బాలరాజు చెప్పి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.
దీంతో గంటా శ్రీనివాస రావు మంగళవారం ఈ విషయమై మాట్లాడుతూ.. బాలరాజు తనకు సమాచారం లేదని చెప్పడం సరికాదని చెప్పారు. గంటా వ్యాఖ్యలపై బాలరాజు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పని వారు చూసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications