వివక్ష: సిఎం కిరణ్ రెడ్డిపై మంత్రి బాలరాజు ఫైర్

తన శాఖకు సంబంధించి తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ముఖ్యమంత్రిని నిందించారు. కాంగ్రెసు విధేయంగా ఉన్నందుకే తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎస్సీఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.
రచ్చబండ కార్యక్రమానికి తనను పిలువలేదని, తనకు చెప్పకుండానే తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలను రచ్చబండ కార్యక్రమంలో చేపట్టారని ఆయన అన్నారు. గతంలో విశాఖపట్నం జిల్లాలో ఫ్లైఓవర్ వంతెన విషయంలో తనకు ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చారని, తనతో తన పర్యటన వివరాలపై చర్చలు జరిపారని, ఇప్పుడు రచ్చబండ విషయంలో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
తాను చాలా మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. ఒక్కరు దూరం చేస్తేనో దగ్గరికి తీస్తేనో భవిష్యత్తు ఆధారపడి ఉండదని, ప్రజలే తాను ఏమిటో చెప్తారని ఆయన అన్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్న విషయం తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. బారాజు మాత్రం హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications