రాజ్యసభ: జగన్ పార్టీ విప్, బాబుకు మోత్కుపల్లి ఝలక్

ఈ నెల 7వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీకి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టలో చేరిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు కూడా ఈ మేరకు పార్టీ విప్ బాలినేని శ్రీనివాస రెడ్డి విప్ జారీ చేశారు. ఈ ఎన్నికల్లో భాగస్వాములు కారాదనేది పార్టీ విధానమని బాలినేని చెప్పారు.
బిల్లుపై సమాచారం కోసం సుచరిత
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు, ఎంతమంది అభిప్రాయాలు చెప్పారు, లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు చెప్పిన వారి వివరాలు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సమాచార అధికారిని కోరారు. జనవరి 30న అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాల ప్రతులు, కేంద్రానికి పంపిన నివేదిక ఇవ్వాలని కోరారు.
అలక వీడని మోత్కుపల్లి
రాజ్యసభ అవకాశం రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అలక వీడలేదు. ఆయన ఇంకా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆగ్రహంగా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగులో పాల్గొనకూడదని తాను నిర్ణయించుకున్నానని మోత్కుపల్లి భావిస్తున్నారు. ఏడోతేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగులో పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి ఓటు వేయబోనని, అసలు ఓటింగులోనే పాల్గొనని జిల్లాకు చెందిన నేతలతో చెప్పారట.












Click it and Unblock the Notifications