అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు సమస్య పైన సమస్య: జగన్ రెచ్చగొడ్తున్నారా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమస్య పైన సమస్య వచ్చి పడుతోంది. మంగళవారం నాడు బందర్ పోర్టుకు వ్యతిరేకంగా అఖిల పక్షం సమావేశమైంది. బందర్ పోర్టు కోసం భూములను లాక్కోవద్దని వారు హెచ్చరించారు.

మచిలీపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం చంద్రబాబు భూదాహానికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బలరాం, సుబ్బారావులు మండిపడ్డారు.

కేవలం రెండు వేల ఎకరాలు సరిపోయే పోర్టుకు లక్ష ఎకరాలు సేకరించడం క్విడ్ ప్రోకో కోసమేనని ఆరోపించారు. గతంలో భూసేకరణకు గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర వెళ్తే ప్రజలు వారి పైన తిరుగుబాటు చేశారన్నారు.

'తరిమి కొడ్తాం.. సీఎం పాపం చేస్తున్నారు, బాబులో మార్పురాలేదు''తరిమి కొడ్తాం.. సీఎం పాపం చేస్తున్నారు, బాబులో మార్పురాలేదు'

Bandar Port issue: All Party meeting irks CM Chandrababu

కాగా, బందరు పోర్టు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చగొడుతోందని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. పోర్టు కోసం లక్ష ఎకరాలు లాక్కున్నామని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ రోజు మచిలీపట్నం రహదారుల పై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. అయితే, ఈ కవాతుకు, బందర్ పోర్టు ఆందోళనతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి కవాతులు సర్వ సాధారణమేనని చెప్పారు.

టి నుంచి ఏపీ కాపీ, 5గురు కీలకం: టీసీఎస్ సిబ్బంది విచారణటి నుంచి ఏపీ కాపీ, 5గురు కీలకం: టీసీఎస్ సిబ్బంది విచారణ

ఇదిలా ఉండగా, చంద్రబాబు పైన విపక్షాలు పలు అంశాలతో ఇరుకున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అమరావతి, బందర్ పోర్టు, హామీలు, కరకట్ట పైన ఇళ్ల కూల్చివేత.. ఇలా తదితర అంశాలతో బాును టార్గెట్ చేస్తున్నారు.

English summary
Bandar Port issue, All Party meeting irks CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X