నోట్ల రద్దు: మోడీకి దత్తన్న ప్రశంసలు
నోట్ల రద్దుతో ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి బండారు దత్తత్రేయ అన్నారు. శనివారం మంత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన ఇటీవల వివాహం జరిగిన నూతన వదూవరులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో మంత్రిని సత్కరించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్లధనాని అరికట్టేందుకు నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరింత సత్ఫలితాలు ఇచ్చేలా ఆశీస్సులు అందించాలని వేంకటేశ్వరస్వామివారిని ప్రార్ధించుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications