రాయలేని రీతిలో 'రోజా'పై బండారు విమర్శలు: నోరు తెరిస్తే బూతేనా!?

విశాఖపట్నం: ప్రతిపక్ష నేతలను విమర్శించాలంటే.. బూతు లేనిదే ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోటివెంట మాట రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలేని భాషలో ఆయన ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్న తీరు పట్ల ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

జనంలో ఉన్నామన్న సంగతి మరిచిపోయి.. తానో ప్రజాప్రతినిధి అన్న సంగతి అంతకన్నా మరిచిపోయి.. అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షం సైతం ఆరోపిస్తోంది. తాజాగా హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డ నేపథ్యంలో.. ఎమ్మెల్యే రోజాకు కౌంటర్ ఇస్తూ బండారు అసభ్య పదజాలాన్ని వాడినట్లు చెబుతున్నారు.

పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ గృహకల్ప లబ్దిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రోజాపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తూ ఆయన విరుచుకుపడ్డ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

bandaru satyanarayana targets roja with vulgar comments

అటు ప్రతిపక్ష అధినేత జగన్ మీడియాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. హెరిటేజ్ పేరిట దొంగ స్టిక్కర్లు తయారు చేసి కంపెనీ వ్యాను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. విషయాన్ని అధికార పార్టీతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్న సాక్షి పత్రికను నిషేధించాలని డిమాండ్ చేశారు.

బండారు దిష్టి బొమ్మ దహనం:

ఎమ్మెల్యే రోజాపై బండారు చేసిన అసభ్య విమర్శలపై వైసీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద బండారు దిష్టి బొమ్మను వారు దగ్దం చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పుసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ గృహకల్ప లబ్దిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+