విజయసాయి రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ నేత సెటైర్లు..ఇది ధర్మమా అంటూ

వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు,ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నేత చేరారు. పార్టీ కీలక నేత, జగన్‌ నమ్మిన వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన పార్టీతో పాటు, రాజ్యసభ సభ్యత్యానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.

Bandla Ganesh satires on Vijayasai Reddy s resignation

విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే విజయసాయి రెడ్డి రాజీనామా ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ తనదైనశైలిలో స్పందించారు. ఇది ధర్మమా..? అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో.. అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది, ఇది ధర్మమా.. అని విజయసాయి రెడ్డిని బండ్ల గణేష్ ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+